By : Oneindia Telugu Video Team
Published : January 06, 2018, 05:10

పవన్ కళ్యాణ్ vs మహేష్ కత్తి : అదీ సంగతి ?

సినీ క్రిటిక్ మహేష్ కత్తికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య సాగుతున్న పోరుకు అంతం లేనట్లే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ అభిమానులు వినడం లేదు.
పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడంపై కత్తి మహేష్ పైన పవర్ స్టార్ అభిమానులు మండిపడ్డారు. దీనిపై మాట్లాడుతూ.. త‌న‌తో ఎవ‌రో ఇలా మాట్లాడిస్తున్నారని ప‌వ‌న్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నార‌ని కత్తి మహేష్ వాపోయారు. తాను కూడా అటువంటి ప్ర‌శ్న‌లు వేయగ‌ల‌న‌ని చెప్పారు. సేవలు చేయడం కోసం పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న ప‌వ‌న్ కళ్యాణ్ ఇంత‌వ‌ర‌కు ఏం సేవ చేశార‌ని ప్ర‌శ్నించారు.
ప‌వ‌న్‌ కళ్యాణ్ రాజ‌కీయ పార్టీ న‌డిపించ‌డానికి డ‌బ్బులు ఎవ‌రు ఇచ్చారని కత్తి ప్రశ్నించారు. ఆయ‌న వెనుక ఎవ‌రైనా ఉన్నారా? అని నిలదీశారు. త‌న‌ సేఫ్టీ తనకు ముఖ్యం కాబ‌ట్టి స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు విష‌యాల‌ను ప‌వ‌న్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని, ఖండించ‌డం లేద‌న్నారు. త‌న‌కు రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పారు.ప‌వ‌న్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్త‌కాన్ని తాను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించి, పూర్తిగా చ‌దివాన‌ని మ‌హేశ్ క‌త్తి అన్నారు. అందులో ప‌వ‌న్ రాసిన విష‌యాలు ఓ ఐద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి కూడా రాయ‌గ‌ల‌డ‌ని విమ‌ర్శించారు. తాను ఇజం పుస్త‌కాన్ని చ‌దివిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు ప‌వ‌న్ తీరుపై ఆస‌క్తి క‌లిగింద‌న్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న ప‌వ‌నిజం ఉద్య‌మ‌మా? ఉన్మాద‌మా? అనే విష‌యంపై ప‌రిశోధ‌న చేశాన‌ని వ్యాఖ్యానించారు.


Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా