By : Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 12:02

World Telugu Conference : నగరానికి రాష్ట్రపతి: అర్ధరాత్రి మందకృష్ణ హంగామా అరెస్ట్

నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ముగిసేంత వరకు ప్రత్యేకంగా 3500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత, తెలుగు మహాసభల బహిష్కరణకు పిలుపు, మందకృష్ణ మాదిగ మిలియన్‌ మార్చ్‌, వారం రోజుల వ్యవధిలో నగరంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలివి. మహాసభల సందర్భంగా ప్రముఖులు, విదేశీ అతిథులు రావడంతో ఎక్కడికక్కడ భద్రతను పటిష్టం చేశారు.
తెలుగు మహాసభలను బహిష్కరించాలని, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిరసనలు వ్యక్తం చేయాలంటూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుపై పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మహాసభల ముగింపు వేదికైన లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణం, రవీంద్ర భారతి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. లాల్‌ బహదూర్‌ క్రీడా ప్రాంగణం, ఆబిడ్స్‌ వైపు కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. క్రీడాప్రాంగణం చుట్టూ మెరుపు దళాలను సిద్ధం చేశారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ ఆందోళనలు నిర్వహించనున్నారో అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.మంగళవారం రాత్రి వేళ ఒక్కసారిగా మందకృష్ణ మాదిగ.. ఎమ్మార్పీస్‌ కార్యకర్తలు చేపట్టిన మిలియన్‌ మార్చ్‌తో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే అప్రమత్తమై భారీగా నష్టం జరక్కుండా జాగ్రత్తపడ్డారు. మందకృష్ణతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా