By: Oneindia Telugu Video Team
Published : January 26, 2018, 05:23

ఎన్టీఆర్‌ను గద్దెదించినప్పుడు ఏడ్చాను

Subscribe to Oneindia Telugu

1989లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సమయంలో తన నియోజకవర్గంలో ఏదైనా పొరపాటు చేశామని ప్రజల ముందు అవమానిస్తారేమోనని భయపడ్డానని మాజీ మంత్రి టిడిపి నేత మండవ వెంకటేశ్వ‌రావు చెప్పారు మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సమయంలో తనను చంపేస్తారని తాను భయపడలేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు రాజ్ భవన్‌ను వెళ్ళిన సమయంలో తాను తీవ్రంగా బాధపడినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు ఎన్టీఆర్ స్థానంలో తన తండ్రి ఉన్నా కూడ ఆయనను గద్దె దింపేందుకు ముందు నడిచేవాడినని ఆయన చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండవ వెంకటేశ్వర్ రావు తన రాజకీయ జీవిత ప్రస్తానం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదని తన తండ్రి చేసిన సూచనను పాటిస్తున్నానని ఆయన చెప్పారు.
మారిన పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకొంటున్నట్టు మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు. ప్రతి సారీ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా కొన్ని సమయాల్లో పార్టీ నాయకత్వం సూచన మేరకు పోటీ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని మండవ వెంకటేశ్వర్ రావు గుర్తు చేసుకొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా