By : Oneindia Telugu Video Team
Published : November 23, 2017, 01:01

అసెంబ్లీకిచ్చిన పెళ్లి సెలవుల పై రచ్చ !

ఏపీ అసెంబ్లీకి,శాసనమండలికి పెళ్లి సెలవులు ఇచ్చారు. గురు, శుక్ర, శనివారాల్లో పెద్దసంఖ్యలో వివాహాలు ఉన్నందున సమావేశాలకు విరామమివ్వాలని సభ్యులు పదే పదే విజ్ఞప్తి చేయడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. శాసన సభ సమావేశాలు 27 న పున:ప్రారంభమై మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని స్పీకర్ కోడెల ఈ సందర్భంగా తెలిపారు.శాసనసభ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ముందుగా జీరో అవర్ లో సెలవుల ప్రస్తావన తెచ్చారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో వరుసగా పెళ్లిళ్లు ఉన్నాయని, వాటికి ఎమ్మెల్యేలుగా తాము హాజరుకాకుంటే బావుండదని, కాబట్టి గురు, శుక్ర, శనివారాల్లో సభకు విరామం ఇవ్వాలని విష్ణుకుమార్‌రాజు స్పీకర్‌ను కోరారు. దీనిపై సభలో ఉన్న ఎమ్మెల్యేలంతా చప్పట్లతో, బల్లలు చరుస్తూ తమ మద్దతు తెలిపారు.తర్వాత గద్దె రామ్మోహన్‌, ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని అడిగారు. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సభ మూడ్‌ చూస్తే విరామం ఇవ్వాలన్నట్లుగా ఉందన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా