By : Oneindia Telugu Video Team
Published : February 27, 2018, 12:59

మేఘాలయలో జోరుగా పోలింగ్...!

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మేఘాలయ లో 60 అసెంబ్లీ స్థానాలుండగా 59 స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మార్చ్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా