By: Oneindia Telugu Video Team
Published : January 23, 2017, 07:15

వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Subscribe to Oneindia Telugu

టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతి అలిపిరి

పాదాల మంటపం వద్ద వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్

వెనుక ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి మూడవ సత్రం ప్రాంగణం నుంచి సుమారు ౩ వేల

మంది భజన మండళ్ళ సభ్యులు ర్యాలీగా ఉదయం మూడు గంటలకు అలిపిరి పాదాల

మండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి

మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్ధ స్వామి మెట్లోత్సవం పూజా కార్యక్రమం నిర్వహించి

భజనమండలి సభ్యులకు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు

అధికారులు, సభ్యులు, భజనమండళ్ళ సభ్యులు పాల్గొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా

కోట్లాది మంది బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ హథీరాం జీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా

తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ సినిమా టైటిల్ పై కొత్త వివాదానికి తెరలేసింది. నమో

వేంకటేశాయ సినిమా టైటిల్ ను 'ఓం శ్రీ సద్గురు హథీరాం బాబా'గా మార్చాలంటూ

తిరుపతిలో గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా