By: Oneindia Telugu Video Team
Published : October 25, 2017, 06:00

కేటీఆర్ స్పీచ్

Subscribe to Oneindia Telugu

సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఫిజికల్ డైరెక్టర్ గొట్టె అంజయ్య పదవి విరమణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... పిల్లలకు చదువుతో పాటు ఆటలపోటీలు కూడా చాలా ముఖ్యమన్నారు. కానీ.. ఇప్పటి చదువులు పిల్లలను క్రీడలకు దూరం చేస్తున్నాయన్నారు. సిరిసిల్లలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గొట్టె అంజయ్య చాలా గొప్ప వ్యక్తి అని కెసిఆర్ కూడా ఎప్పుడు అంజయ్య ని తలుచుకుంటారు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలపోటీలు చాలా ముఖ్యం అని చెప్పిన కేటీఆర్ గొట్టె అంజయ్య పాటసాలకు చేసిన సేవల గురించి ప్రస్తావించారు. అనంతరం మధ్యాహ్నం 1గంటలకు వాసవి కల్యాణమండపంలో జరిగిన జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.



Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా