By : Oneindia Telugu Video Team
Published : November 20, 2017, 10:40

మిస్ వరల్డ్ పై 'చిల్లర' వ్యాఖ్యలు

పదిహేడేళ్ల తర్వాత భారత దేశానికి మిస్ వరల్డ్ కిరీటం అందించిన మానుషీ చిల్లార్ పైన కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని, మన చిల్లరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చిల్లర్ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైందని వివాదానికి తావిచ్చే ట్వీట్ చేశారు.ఇన్నేళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకు వస్తే మానుషీ చిల్లార్‌ను చిల్లరతో పోల్చడం సరికాదని శశిథరూర్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి ఆయన చిల్లర వ్యాఖ్యలకు నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.
శశిథరూర్ వ్యాఖ్యల పైన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషీ ఘనతను తక్కువ చేసి చూపినందుకు క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. నటుడు అనుపమ్ ఖేర్ కూడా థరూర్ పైన విమర్శలు గుప్పించారు.
మరోవైపు, శశిథరూర్ వ్యాఖ్యల పైన జాట్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. మానుషీ చిల్లార్ జాట్ వర్గానికి చెందినవారు. ఆమెను అవమానించడం అంటే జాట్‌లను అవమానించడమేనని ఆ వర్గానికి చెందిన వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా