By: Oneindia Telugu Video Team
Published : April 29, 2017, 12:35

మోడీ బుగ్గకార్ల నిషేదం

Subscribe to Oneindia Telugu

మోడీ... పేరులోనే ఉంది... ఈయన ఏవిషయంపై అయినా ఢీ కొట్టారంటే అటో ఇటో తేలిపోవాల్సిందే. ప్రధానంగా సామాన్యులు పడే ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టి... ఎవరకూ ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ మించిన వాళ్లు మరొకరుండరు. అధికారంలోకి వచ్చీరాగానే... నల్లధనం అంశంపై దృష్టిపెట్టిన ఆయన... నల్ల కుబేరులను ఏరి పారేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగమే పెద్ద నోట్లు రద్దు. దీంతో ఏ స్థాయిలో బ్లాక్‌ మనీ బయటకు వచ్చిందో అందరికీ తెలిసిందే. అవినీతి సొమ్మును కూడబెట్టాలంటనే భయపడే చందంగా మోడీ నిర్ణయాలు తీసుకోవడం విశేషం. అంతేకాదు ఏసీబీ, ఇన్‌కమ్‌ టాక్స్‌, విజిలెన్స్‌ వంటి శాఖలను సమన్వయపర్చి... అవినీతి సొమ్ములు ఎక్కడున్నాయో వాటన్నింటినీ బయటకు లాగేస్తున్నారు. ఇప్పుడు తాజగా ఎర్రబుగ్గ కార్లపై దృష్టిపెట్టారు. వీఐపీలు ఉపయోగించే ఎర్రబుగ్గ కార్లపై కేంద్రం నిషేధం విధించింది. వీఐపీ కల్చర్ కు చరమగీతం పాడటంలో పెద్ద ముందడుగు వేసింది కేంద్రం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలు, ఐఏఎస్ అధికారులు ఎవ్వరూ ఇకపై బుగ్గ కారులు ఉపయోగించరాదు. కేవలం అత్యవసర సేవల్లో ఉపయోగించే వాహనాలకు, అంబులెన్సులకు మాత్రమే ఎర్రబుగ్గ కారులు ఉపయోగిస్తారు. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగి ఎర్రబుగ్గ కార్లు ఉపయోగించడం మానేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా