By: Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 03:51

పోలవరం లెక్కలపై అనుమానం ఇక బాబు పై మోదీ నిఘా...

Subscribe to Oneindia Telugu

మూడేళ్ల తేడాలో పోలవరం అంచనా వ్యయం అనూహ్య రీతిలో పెరిగింది. పెరిగిన అంచనాతో కేంద్రం సంబంధం లేదని చేతులు దులుపేసుకుంది. మరోవైపు 2018నాటికి పోలవరం పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు అండ్ కో ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.

అదే సమయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం సడలినట్లుగా కనిపిస్తోంది. పట్టుబట్టి మరీ పోలవరాన్ని చంద్రబాబు సర్కార్ తన గుప్పిట్లో పెట్టుకోవడం వెనుక ఆంతర్యమేంటో కేంద్రానికి తెలిసొచ్చినట్లుంది. ఇంకేం.. మరో ఉన్నత స్థాయి కమిటీతో ప్రధాని మోడీ పోలవరంపై నిఘా పెట్టారు. ఇప్పటికే ఉన్న కమిటీలకు తోడు ఒక్క పోలవరం ప్రాజెక్టు పైనే ఇది మూడో కమిటీ కావడం గమనార్హం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా