• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 10, 2018, 10:50
    Duration : 01:38

    థాంక్యూ సూపర్‌స్టార్: మహేష్ బాబు వీడియోను ట్వీట్ చేసిన కవిత

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియోను షేర్ చేశారు టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆ వివరాల్లోకి వెళితే.. రక్షా బంధన్‌కు హెల్మెట్‌ను కానుకగా ఇవ్వండి అంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గత ఏడాది ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.అది అప్పుడు చాలా పాపులర్‌ అయి రాఖీ సందర్భంగా తమ అన్న, తమ్ముళ్లకు హెల్మెట్లను కానుకగా ఇచ్చారు. తాజాగా ఈ క్యాంపైన్‌కు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన వంతు సహాయాన్ని అందించారు.నేడు(ఆగస్టు 9) ప్రిన్స్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా కవిత తన ట్విటర్‌ ఖాతాలో.. మహేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక, సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌ క్యాంపైన్‌కు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మహేష్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా