By : Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:13

కోహ్లీకి మరిచిపోని బహుమతి ఇచ్చిన ధోనీ

టీమ్‌ఇండియా సారథి కోహ్లీకి ప్రత్యేక బహుమతి దక్కింది. నాయకునిగా తానేంతో అభిమానించే ధోనీ నుంచి కలకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ అందుకున్నాడు. ఇంగ్లాండుతో రెండో వన్డే గెలిచిన తర్వాత స్టంప్స్‌ను తీసుకెళ్లడం ధోనీకున్న అలవాటు. అయితే ఈ మధ్య కాలంలో ఎల్‌ఈడీతో తయారు చేసిన ఖరీదైన స్టంప్‌లను నిర్వాహకులు తీసుకెళ్లనివ్వడం లేదు. దీంతో స్టంప్స్ బదులుగా ఈసారి బంతిని ఎంచుకున్నాడు ధోనీ. కటక్‌లో గెలిచిన తర్వాత కోహ్లీకి బంతిని కానుకగా ఇచ్చాడు. దీనికి పులకించిపోయిన విరాట్ దానిపై మహీ సంతకం తీసుకున్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా