By: Oneindia Telugu Video Team
Published : November 03, 2017, 06:40

ధోనీని చూస్తే మా నాన్న గుర్తుకు వస్తారు

Subscribe to Oneindia Telugu

అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. అలాంటి దిగ్గజ క్రికెటర్ నుంచి మహేంద్ర సింగ్ ధోనికి ఊహించిని అభినందన వచ్చింది. ఇంతకీ ఆ అభినందన ఏంటని అనుకుంటున్నారా? తాను ఆడిన అనేక మంది కెప్టెన్ల నేతృత్వంలో ఆడానని, వారందరిలో కెల్లా ధోనినే ది బెస్ట్ అని సచిన్ వ్యాఖ్యానించాడు. భారత దేశానికి వరల్డ్ కప్ అందించాలన్న తన చిరకాల కోరిక మహేంద్ర సింగ్ ధోని వల్లే నెరవేరిందని సచిన్ చెప్పుకొచ్చాడు. ధోని గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా సచిన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
'ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ధోనీని చూస్తే మా నాన్న రమేశ్‌ టెండూల్కర్ గుర్తుకు వస్తారు. మొదటిసారి ధోనిని కలిసినప్పుడు నాకెంతో గౌరవమిచ్చాడు. అప్పుడే నాకు మా నాన్న గుర్తొచ్చారు. జట్టు గెలిచినా.. ఓడినా ధోని చాలా సైలెంట్‌గా కనిపించేవాడు. మా నాన్న కూడా అంతే. ఏది జరిగినా మౌనంగా ఉంటారు. అందుకే ధోనీని చూస్తే నాకు మా నాన్న గుర్తుకు వచ్చేవారు' అని సచిన్‌ అన్నాడు. ఇదిలా ఉంటే సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ 1999 మే 19న మరణించారు. తండ్రి మరణించిన సమయంలో సచిన్ టెండూల్కర్ 1999 వరల్డ్ కప్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా