By: Oneindia Telugu Video Team
Published : November 09, 2017, 06:13

2020 టీ20 వరల్డ్ కప్‌లో "ధోని" నా ?

Subscribe to Oneindia Telugu

2020లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడే సత్తా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉందని మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ధోని విఫలం కావడంతో టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు సూచించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆశిష్ నెహ్రా స్పందించాడు. తాను జట్టుకి ఉపయోగపడని ధోని భావిస్తే నిజాయతీగా వీడ్కోలు చెప్పేస్తాడని నెహ్రా వెల్లడించాడు. కేవలం ఒకటి లేదా రెండు సిరీస్‌ల గణాంకాలు ఆధారంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోమని చెప్పడం ఎంత మాత్రం సరికాదని నెహ్రా అభిప్రాపయపడ్డాడు.
'ప్రతి ఇంటికి ఒకరు పెద్ద కావాలి. అలానే జట్టులో ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు. నా అంచనా ప్రకారం మరో రెండు లేదా మూడేళ్లు శరీరం సహకరిస్తే అతను క్రికెట్ ఆడతాడు. ఒకవేళ అతను జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే నిజాయతీగా పక్కకి తప్పుకుంటాడు' అని నెహ్రా అన్నాడు. 'కానీ.. ప్రస్తుతం అతడ్ని స్వేచ్ఛగా ఆట ఆస్వాదించనివ్వండి. ఎందుకంటే అతను దేశం కోసం ఏ త్యాగానికైన వెనకాడబోడు. నా అంచనా ప్రకారం ధోని కచ్చితంగా 2020 టీ20 ప్రపంచకప్ కూడా ఆడతాడు. 39 ఏళ్ల వయసు వచ్చే వరకూ నాలాంటి ఒక ఫాస్ట్ బౌలర్ క్రికెట్ ఆడగా లేనిది. ఇప్పటికీ మంచి ఫిటెనెస్‌తో ఉన్న ధోనీ టీ20, వన్డేలు ఆడేందుకు అర్హుడే' అని నెహ్రా అన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా