By : Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 11:52

వర్షాలు ఇలాగే కొనసాగితే ముంబై పూర్తిగా మునిగిపోయే ప్రమాదం......


భారీ వ‌ర్షాల‌కు ముంబై జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రైల్వేట్రాకులు, రహదారులు నీటమునిగాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ముంబైలో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షానికి ముంబై వాసులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. జలమయమైన ముంబై రోడ్లు నదులను తలపిస్తున్నాయి. జలదిగ్భందంతో ముంబైలో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా