By : Oneindia Telugu Video Team
Published : April 21, 2018, 07:06

నా పేరు సూర్య ఆడియో లాంచ్ కి కదలనున్న మెగా ఫ్యామిలీ

నాపేరు సూర్య సినిమాకు సంభందించి ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం హాలీవుడ్ కాపీయేనంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందు కుంది. 2002లో వచ్చిన 'యాంట్వోన్ ఫిషర్' సినిమాను కాపి కొట్టి ఈ సినిమా తీసారని వచ్చిన వార్తలో నిజం లేదని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాపేరు సూర్య సినిమాకు సంభందించిన ఆడియో ఫంక్షన్ ఈ నెల 29న హైదరాబాద్ లో జరగనుంది ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నా పేరు సూర్య సినిమాకు నాగబాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. నాగబాబు పవన్ ను ఆడియో వేడుకకు పిలిచినట్లు సమాచారం. దాదాపు పవన్ ఈ వేడుకకు రావడం ఖాయనని చెబుతున్నారు కొందరు మెగా అభిమానులు. బన్ని పవన్ కు మద్దతు తెలిపాడు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్, బన్ని ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం. చిరంజీవి కూడా ఈ ఫంక్షన్ కు రాబోతున్నాడు. మెగా హీరోలందరూ ఒకే వేదికపై కనిపించబోతుండడం విశేషం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా