By: Oneindia Telugu Video Team
Published : August 24, 2017, 11:06

నంద్యాల ఎవరిదో తేల్చి చెప్పిన లగడపాటి

Subscribe to Oneindia Telugu

అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా నంద్యాల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా 80 శాతం పోలింగ్ నమోదయ్యినట్లు తెలిసింది . ఐతే మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం టీడీపీదేనని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఓటింగ్‌ శాతం పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడం సరికాదని లగడపాటి అభిప్రాయపడ్డారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా