By: Oneindia Telugu Video Team
Published : August 31, 2017, 10:19

రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్నాయుడు దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబు

Subscribe to Oneindia Telugu


నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కన్పించారు. ఉదయం పూట ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి ఆయన టెలికాన్పరెన్స్ నిర్వహించడంతో మంత్రులు, పార్టీ నేతలు బిత్తరపోయారు.ఫలితాలు ముందే ఊహించిన బాబు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ నెల 28వ, తేదిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూశారు.2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో టిడిపి, వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి, అయితే నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 28వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం వైసీపీకి చుక్కలు చూపింది. శిల్పా సోదరుల రాజకీయ భవితవ్యంపై నంద్యాల ఉప ఎన్నిక తీవ్ర ప్రభావం చూపింది.నంద్యాల ఉప ఎన్నిక ఏపీ రాష్ట్రంలో రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నుండి టిడిపిలోకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా