By: Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 02:34

శిల్పా మోహన్ రెడ్డి ఓటమికి అసలు కారణం ఇదే!

Subscribe to Oneindia Telugu

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం ఖరారైంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమి స్పష్టంగా తెలుస్తోంది. పదో రౌండ్, 11 రౌండ్ లో కూడా టీడీపీనే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో, ఓటమి ఖాయమైన దశలో శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన తక్కువగా మాట్లాడి వెళ్లిపోయారు. ఈ ఎన్నికలో టీడీపీ అభివృద్ధి వల్ల గెలవలేదని... డబ్బు అండతో గెలిచిందని ఆయన ఆరోపించారు. మైనార్టీలు కూడా టీడీపీకి ఓటు వేశారని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతానా? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటానా? అనే విషయంపై తర్వాత మాట్లాడతానని చెప్పారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా