By : Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 02:43
00:56
రికార్డు మెజార్టీతో టీడీపీ విజయ భేరి....
17నుంచి 19వ రౌండ్లో గోస్పాడు మండల ఓట్ల లెక్కింపు జరిగిన నేపద్యంలో 17 వ రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీకి 915 మెజారిటీ ఓట్లు పోలయ్యాయి. 17వ రౌండ్ తర్వాత టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 26,523 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.! 18 వ రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీకి 506 మెజారిటీ ఓట్లు పోలయ్యాయి దాంతో 27,029 ఓట్ల ఆధిక్యంతో tdp నిలిచింది. ఇక 19 రౌండ్లు ముగిసేసరికి 27,296 బారీ మెజారిటీ తో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయ భేరి మోగించారు. టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించిన భూమ బ్రహ్మానందరెడ్డికి ఇప్పటికే పలువరు అభినందనలు తెలుపుతున్నారు.