By: Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 01:16

‘సైకిల్’ స్పీడ్ తగ్గట్లేదు.... 12వ రౌండ్ తో 21,841 ఓట్ల ఆధిక్యం

Subscribe to Oneindia Telugu

నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తొమ్మిదో రౌండ్ లోనూ టీడీపీ అదే దూకుడు కొనసాగించింది..ఆధిక్యం కనబరిచింది. ఈ రౌండ్ లో 879 ఓట్ల మెజారిటీ సాధించింది. మొత్తం తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీకి 18,107 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు దాదాపు ఖాయమైంది. 7 8 9 రౌండ్ లో స్వల్ప ఆధిక్యం కనబరిచిన టీడీపీ పదో రౌండ్ లో మాత్రం ఆదిక్యం పెంచుకుంది. కాగా పదో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడింగా 1486 మెజారిటీ తో శిల్పా మోహన్ రెడ్డి కన్నా భూమా 19,657 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 11వ రౌండ్ కౌంటింగ్ లో TDP 604 ఓట్ల మెజారిటీ సాధించింది. దీంతో 11వ రౌండ్ పూర్తి అయ్యేసరికి tdp 20261 ఓట్ల మెజారిటీ సాధించింది ,ఇప్పటివరకూ ఒక్క రౌండ్ లో కూడా శిల్పా ఆధిక్యత కనిపించలేదు. ఇక వైకాపా ఎన్నో ఆశలు పెట్టుకున్న గోస్పాడులో పూర్తి మెజారిటీ సాధించినా భూమాను అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక 12వ రౌండ్ కౌంటింగ్ లో TDP 1580 ఓట్ల మెజారిటీ సాధించి 21,841 ఓట్ల ఆధిక్యం SAMPAAdinchindi . ఐతే 6 నుంచి 16వ రౌండ్ వరకు నంద్యాల అర్బన్ ఓట్లను లెక్కించనుండగా ఇంకో 4 రౌండ్ లలో టౌన్ వోట్ల లెక్కింపు పూర్తి కానుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా