By: Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 09:47

నంద్యాల ఉప ఎన్నిక తొలి ఫలితం ఉదయం 9గంటలకు

Subscribe to Oneindia Telugu

అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉదయం 8గంటలకు ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి ఫలితం ఉదయం 9గంటలకు వెలువడే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10.30-11.00గంటలకల్లా లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లపై మొత్తం 19రౌండ్లు కొనసాగనుంది. రౌండ్ల వారీగా మెజార్టీని తెలిపేందుకు కౌంటింగ్‌ కేంద్రం ఎదుటనే పెద్ద ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేశారు. మొదట నంద్యాల మండలంలోని గ్రామీణంతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా