By: Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 11:55

రూరల్ నుండి టౌన్ కు స్వల్ప ఆధిక్యం తో సైకిల్

Subscribe to Oneindia Telugu

నంద్యాల అర్బన్ లో టీడీపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉండటంతో అక్కడ దాని ఆధిక్యం కొనసాగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక, గోస్పాడులోనూ టీడీపీ ఆధిక్యం కనబరుస్తుందనే ధీమాను టీడీపీ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం స్వల్ప ఆధిక్యం కనబరుస్తుంది. ఐతే ఆరో రౌండ్ నుంచి టౌన్ ఓట్లను లెక్కిస్తుండగా 6 వ రౌండ్ లో కూడా tdp 3౩03 ఓట్ల ఆధిక్యం తో దూసుకెల్లింది, 6 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి tdp 16,465 వోట్ల ఆదిక్యంలో ఉంది. ఇక 7 వ రౌండ్ లో TDP 512 ఓట్ల మెజారిటీ సాదించగా , 7 వ రౌండ్ ముగిసేసరికి TDP 16,880 వోట్ల ఆదిక్యంలో ఉంది. kaaga నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఎనిమిదో రౌండ్ లో టీడీపీకి 348 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీకి 17,228 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా, ఏడో రౌండ్ లో స్వల్ప ఆధిక్యం కనబరిచిన టీడీపీ, ఎనిమిదో రౌండ్ లోనూ అదే తీరులో ఆధిక్యం కనబరిచింది. అయితే, వరుసగా 8 రౌండ్లలో టీడీపీ ఆధిక్యం కనబరచడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా భూమా వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే 6 నుంచి 16వ రౌండ్ వరకు నంద్యాల అర్బన్ ఓట్లను లెక్కించనుండగా, 17 నుంచి 19వ రౌండ్ వరకు గోస్పాడు మండల ఓట్లను లెక్కించనున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా