By: Oneindia Telugu Video Team
Published : June 28, 2017, 05:42

మళ్ళీ నోరు జారిన లోకేష్ ఈ సారి ఏంటి ?

Subscribe to Oneindia Telugu

మైకుల ముందు పదేపదే తడబడుతున్న ఏపీ మంత్రి లోకేష్ మరోసారి తప్పులో కాలేసినట్లు తెలుస్తోంది. బుధవారం మాజీ ప్రధాని పీవి నరసింహారావు జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన.. మాటల మధ్యలో నోరు జారారని సమాచారం. పీవి గురించి ప్రస్తావిస్తూ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ప్రధాని అయ్యారంటూ లోకేష్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఆ వెంటనే తప్పు గ్రహించిన లోకేష్.. తెలుగు ప్రజల నుంచి పీవి ప్రధాని అయ్యారంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారట. దీంతో లోకేష్ తప్పుల జాబితాలో మరో తప్పు చేరినట్లయింది. యథావిధిగా ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు దీన్ని హైలైట్ చేసి కౌంటర్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా