By : Oneindia Telugu Video Team
Published : January 11, 2018, 07:07

నారా లోకేష్ ఫన్నీ స్పీచ్ లు, ఫ్యాన్స్ కౌంటర్లు : జోకులే జోకులు

నారా లోకేష్ tdp లో ఇప్పుడు ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో అందరకి తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో ఆయన టంగ్ స్లిప్ అవ్వడం, మిస్టేక్స్ మాట్లాడటం జరిగింది. వాటికి ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వటం, జోక్స్ వెయ్యడం కూడా మన అందరకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గతంలో పొంతన లేకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటలను తీసుకుని ప్రత్యర్థులు ఆయనను హేళన చేసే ప్రయత్నాలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో మైండ్ సెట్ మార్చేందుకు చంద్రబాబు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. అది కూడా తమకు అవసరమైన విధంగా వారి మైండ్ సెట్ మార్చేందుకు మానసిక విశ్లేషకులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ స్థితిలోనే తన మనస్తత్వ లోపాలపై కూడా లోకేష్ శిక్షణ తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. ప్రసంగంలో ఆయన చేసిన పొరపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల లోకేష్ తన ప్రసంగం సమయంలో చేసిన పొరపాట్లను సోషల్ మీడియాలో పలువురు అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా లోకేష్ విశాఖలో ప్రసంగం సమయంలో చేసిన పొరపాటును అప్ లోడ్ చేశారు.
అదే సమయంలో లోకేష్ తన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నారు. 'ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఓన్లీ కంపెనీ టు హావ్ ఫైబర్ టు ఎవ్రీ హోమ్' అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా