By: Oneindia Telugu Video Team
Published : November 02, 2017, 04:33

న్యూయార్క్ దాడి: ఏడాది ప్లాన్

Subscribe to Oneindia Telugu

గత కొంత కాలంగా ఉగ్రవాదులు వాహనాలనే తమ ఆయుధాలుగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఊహించని విధంగా సామాన్య జనాలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అడ్డుకట్ట వేయలేని పరిస్థితుల్లో ఉగ్రవాదులు ఈ దారుణాలకు తెగబడుతున్నారు. అప్పటి వరకు మంచివారిగానే సమాజంలో ఉన్న వ్యక్తులు.. ఒక్కసారిగా ఉగ్రవాదులుగా మారిపోయి ఇలా మారణహోమం సృష్టిస్తుండటం ఆందోళన కలిగించే అంశమే.న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలో జరిగిన ట్రక్కు బీభత్సం ఘటన ఇప్పటికి మరిచిపోలేము. ఆ ఉగ్రదాడిలో ఎనిమిది మంది సామాన్యులు మృతి చెందారు. ఈ దాడికి ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది సైఫుల్లో హబీబుల్లావిక్ సైపోవ్ పాల్పడ్డాడు. అతడు ఉజెకిస్తాన్ దేశస్తుడు.ఈ దాడి కోసం దుండగుడు ఏడాది నుంచి ప్లాన్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసి) వీడియోలను చూసి తాను ప్రేరణ పొందినట్లు అతను వెల్లడించాడని తెలుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా