By : Oneindia Telugu Video Team
Published : March 17, 2018, 01:17

షకిబ్ అల్ హసన్ ఎందుకు ఇలా చేసాడు?


నిదాహస్‌ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి పైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.
మ్యాచ్‌ చివరి ఓవర్లో బంగ్లాదేశ్-శ్రీలంక ప్లేయర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు.ఒకానొక దశలో మ్యాచ్‌ నిలిచిపోతుందేమో అనిపించేలా బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే.. ఎట్టకేలకి ఆ జట్టు కోచ్,అంపైర్లు చొరవ తీసుకుని ఆటగాళ్లని శాంతపరచడంతో.. మ్యాచ్ కొనసాగింది. ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు.కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్‌కి బంగ్లాదేశ్ కోచ్, జట్టు మేనేజర్‌ ఖాలెద్‌ మెహమూద్‌ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్‌ కొనసాగించారు.
గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైదానంలో సంబరాలతో హోరెత్తించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్‌ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది శ్రీలంక బోర్డుకు ఫిర్యాదుచేశారు.
దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more