By: Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 12:57

ఢిల్లీ నిర్భయ కేసు తీర్పు నేడే మరణశిక్షా? జీవిత ఖైదా ?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించనుంది. దేశ రాజధానిలో జరిగిన ఆ పాశవిక ఘటన దేశ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి సుప్రీంకోర్టు తన తీర్పులో ఉరిశిక్ష విధిస్తుందా? లేక జీవిత ఖైదుతో సరిపెడుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ టాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు నేటికి వాయిదా పడింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా