By: Oneindia Telugu Video Team
Published : January 04, 2018, 03:11

రక్షణ లేకుండా.. వీధిలో నడుచుకుంటూ

Subscribe to Oneindia Telugu

మన దేశంలో మంత్రులు ఎక్కడికైనా వెళ్తే వారి చుట్టూ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉండటం సహజం. ఇక వారు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతాకాదు.
వారి రాకపోకల కారణంగా సామాన్యులు ఎంత ఇబ్బంది పడినా సరే.. ఆ బుగ్గకారు, బందోబస్తు భోగాలను వదులుకోవడానికి అమాత్యులు ఎంతమాత్రం ఇష్టపడరు. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మాత్రం ఇందుకు మినహాయింపుగానే చెప్పుకోవాలి.
కేంద్రమంత్రి.. అదీ అత్యంత కీలకమైన రక్షణ మంత్రి పదవిలో ఉన్న నిర్మలా సీతారామన్‌ ఏ హంగూ, ఆర్భాటం లేకుండా సామాన్య వ్యక్తిలా వీధిలో నడిచి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరులో పర్యటించిన నిర్మలా సీతారామన్‌ ఓ సమావేశం ముగించుకొని మధ్యాహ్నం సమయంలో ఎస్పీ ఆఫీసు నుంచి నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న హోటల్‌లో భోజనం చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కొంతమంది అధికారులు, సామాన్యులు తప్ప ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. నిర్మలా సీతారామన్‌ నిరాడంబర వ్యక్తిత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా