• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 21, 2018, 06:57
    Duration : 03:58

    కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

    ఏపీకి ఎన్డీఏ చేసిన అన్యాయంపై దేశానికి చెప్పేందుకే అమరావతి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టినసమయంలో మద్దతు ఇచ్చిన పార్టీలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ప్రభుత్వానికి అంత మెజార్టీ వచ్చిందంటే తమ భాగస్వామ్యం కూడా ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పలుమార్లు మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ముందు హామీ ఇచ్చి మాటతప్పారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత నెల్లూరులో కూడా ఇదే తరహా హామీ ఇచ్చారు. అనంతరం అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో కూడా కొంత ఎమోషనల్‌గా మోడీ మాట్లాడారని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీకి మించిన రాజధానిని కడతామని హామీ ఇచ్చారని చెప్పారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా