By : Oneindia Telugu Video Team
Published : December 16, 2017, 12:37

రాజ్యసభలో ఇక నో ‘బెగ్’

రాజ్యసభలో ఛైర్మన్ అయిన వెంకయ్యనాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ‘ఐ బెగ్‌ టు' అని పలికేవారు. సభ్యులు ఇకపై ఆ పదాన్ని వాడొద్దని వెంకయ్యనాయుడు సూచించారు. అది వలసవాదానికి నిదర్శనమని, ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని వెంకయ్య స్పష్టం చేశారు. పార్లమెంట్‌ శీతకాల సమవేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఈ సూచన చేశారు. పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు కొందరు ఐ బెగ్‌ టు (నేను వేడుకుంటున్నా) అనే పదాన్ని వాడటం చూసిన వెంకయ్య ఈ సూచన చేశారు.
నేను వేడుకుంటున్నాను' అనే మాటలను మర్చిపోవాలని, ఆ పదం స్థానంలో ‘నేను లేవనెత్తుతున్నాను' అనే మాటను ఉపయోగించాలని సూచించారు. అయితే, ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని సభ్యులకు తెలిపారు. అంతేగాక, మృతిచెందిన సభ్యులకు సంతాప ప్రకటన సందర్భంలోనూ సభలో వెంకయ్య నిల్చోవడం కనిపించింది. అంతకుముందు ఛైర్మన్లుగా వ్యవహరించిన హమీద్‌ అన్సారీ, భైరాన్‌ సింగ్‌ షెకావత్‌ మాత్రం కూర్చునే ఉండేవారు. అటు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా సంతాప ప్రకటన సమయంలో నిల్చుంటుండటం గమనార్హం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా