By: Oneindia Telugu Video Team
Published : January 09, 2018, 01:47

అజ్ఞాతవాసి కి ప్రత్యేక షోలు : మరి జై సింహా, జై లవ కుశ కి ఎందుకు లేవు ?

Subscribe to Oneindia Telugu

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఓకే చెప్పింది. రోజుకు నాలుగు సినిమాలకు తోడు మరో మూడు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది.
దీంతో రోజుకు ఒక్కో థియేటర్లో రోజుకు ఏడు షోలు ప్రదర్శించబడతాయి. సాధారణంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నాలుగు షోలు ఉంటాయి. అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా ప్రత్యేకంగా మూడు షోలకు అనుమతించింది.
అజ్ఞాతవాసి సినిమాకు మరో మూడు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొందరు గత ఏడాది విడుదలైన జై లవ కుశ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జై లవ కుశ ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని గుర్తు చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక షోలకు నిరాకరించింది.
జై లవ కుశ సినిమా ప్రత్యేక షోలకు చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించిందని, కానీ అజ్ఞాతవాసి సినిమాకు జనవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అనుమతి ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా