By : Oneindia Telugu Video Team
Published : March 07, 2018, 11:37

అశోక్-సుజనల రిజైన్?

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని, ప్యాకేజీ, విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం తెలిపింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇతర రాష్ట్రాలను లెక్కలు అడగకుండా ఏపీనే ఎలా అడుగుతారని, ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పాలని అనడం ఏమిటని టీడీపీ ఎంపీలు చంద్రబాబు వద్ద అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడిన అంశాలను ఎంపీలకు చెప్పారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకుందామన్నారు.

నిధులపై లెక్క చెప్పలేదని కేంద్రం అనడం సరికాదని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో తాను ఈ అంశంపై మాట్లాడుతానని చెప్పారు. ఎంపీలు ఆందోళనలు పార్లమెంటులో కొనసాగించాల్సిందేనని చెప్పారు. తాను ఇప్పటికే మన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాట్లాడానని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. 95 శాతం మంది ఎమ్మెల్యేలు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చెప్పారని తెలిపారు.

దానికి ఎంపీలు స్పందిస్తూ.. మేం కూడా అదే అభిప్రాయంతో ఉన్నామని చెప్పారు. చట్టంలో ఉన్నవి మాత్రమే అమలు చేయాలని మనం అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు, చట్టంలో ఉన్న వాటిని అమలు చేయమంటే సాధ్యం కాదని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా