By : Oneindia Telugu Video Team
Published : April 02, 2018, 02:17

హవ్వ!!: కోహ్లీని కౌంటీకి పంపుతారా?

పాలకుల కమిటీ (సీవోఏ), ఆఫీస్‌ బేరర్ల మధ్య అభిప్రాయబేధాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కొంతకాలంగా బీసీసీఐ వేడెక్కుతోంది. సుమారు 22 రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలతో బోర్డు మాజీ బాస్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.
సీవోఏ నిర్ణయాలపై సుప్రీంకోర్టులోనే సవాల్‌ చేసేందుకు శ్రీని అధ్యక్షతన సమావేశం తీర్మానించినట్టు అనధికార సమాచారం. బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి బహిరంగంగానే సీవోఏ వైఖరిపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాడు.
పాలకుల కమిటీ, ఆఫీస్‌ బేరర్లతో సంప్రదించి తీసుకున్న నిర్ణయాల్లో విరాట్‌ కోహ్లిని కౌంటీ క్రికెట్‌లోకి అనుమతించటమేనని బీసీసీఐ బోర్డు వర్గాలు అంటున్నాయి. మిగతా వాటిలో మెజార్టీ నిర్ణయాలను పాలకుల కమిటీ చైర్మన్‌ వినోద్‌ రాయ్ ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని ఆఫీస్‌ బేరర్ల నుంచి వస్తున్న తీవ్ర ఆరోపణ. ఇందుకు బలం చేకూర్చుతున్నట్టుగా ఇటీవల బీసీసీఐ నియామకం ఒకటి చోటుచేసుకున్నది.
రాజస్థాన్‌ మాజీ డీజీపీ అజిత్‌ సింగ్‌ను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌గా నియమిస్తూ పాలకుల కమిటీ ప్రకటన చేసింది. దీనిపై ఆఫీస్‌ బేరర్లను సంప్రదించలేదని తెలుస్తోంది. కానీ పాలకుల కమిటీ, లోధా సిఫారసుల ప్రకారం బోర్డు ఉద్యోగులు 60 ఏళ్ల వయసొచ్చాక ఉద్యోగ విరమణ చేయాలి. ఆఫీస్‌ బేరర్లకు ఇది 70 ఏళ్లు. కానీ ప్రస్తుతం ఏసీయూ చీఫ్‌గా ఎంపికైన అజిత్‌ సింగ్‌ వయసు 61. ఆయనకు ముందు ఏసీయూ చీఫ్ గా పని చేసిన నీరజ్ కుమార్ ను ఐపీఎల్ నేపథ్యంలో వచ్చేనెలాఖరు వరకు కొనసాగించాలని బీసీసీఐ పాలక మండలి నిర్ణయించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా