By : Oneindia Telugu Video Team
Published : March 10, 2018, 12:08

హద్దులు దాటిన చాటింగ్.. నగ్న చిత్రాల దాకా

ఫేస్‌బుక్ స్నేహాలు కొంతమందికి మేలు చేస్తే.. మరికొంతమందిని మాత్రం అనుకోని ఆపదల్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా అమాయక మహిళలు మేక వన్నె పులుల వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహిత కూడా ఇలాగే మోసపోయింది.

టోలిచౌకికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచింది. ఆమె భర్త జీవనోపాధి రీత్యా దుబాయ్ వెళ్లాడు. ఇంటి వద్దే ఉండే సదరు వివాహిత కాలక్షేపం కోసం పలువురితో చాటింగ్ చేసేది. ఆ చాటింగే ఆమె కొంపముంచేదాకా తీసుకొచ్చింది. జుబేర్‌గా ఆమెకు పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను అనుకోని కష్టాల్లోకి నెట్టాడు.

జుబేర్‌తో సదరు వివాహిత రోజూ చాట్ చేయడంతో.. వీరిద్దరూ కాస్త హద్దులు దాటారు. వ్యక్తిగత జీవితం గురించి కూడా చాటింగ్ ద్వారా చర్చించుకున్నారు. వీటిల్లో పలు అభ్యంతరకర విషయాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టిన జుబేర్.. నగ్న చిత్రాలు పంపించాలని బెదిరించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా