అక్టోబరు 25న సూర్యగ్రహణం, మళ్లీ 2032లోనే
Published : October 19, 2022, 03:40
ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న కనిపించనుంది. ఇక, భారత్లో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఇదే. ఏప్రిల్ 29న ఏర్పడిన గ్రహణం భారత్లో కనిపించలేదు. తాజాగా ఏర్పడే సూర్య గ్రహణం దీపావళి రోజున సంభవిస్తుంది. ఐరోపా, పశ్చిమ సైబీరియా, ఆసియా, ఆఫ్రికాలోని ఈశాన్య భాగంలో ఈ గ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.