By: Oneindia Telugu Video Team
Published : November 20, 2017, 11:25

‘పద్మావతి’వాయిదా..

Subscribe to Oneindia Telugu


అనుకున్నంతా అయ్యింది. రాజపుత్రుల వంశీయురాలు 'రాణి పద్మిని' జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం 'పద్మావతి' వివాదాలు, హెచ్చరికల మధ్య విడుదల ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ సినిమాలో బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకునే టైటిల్‌ రోల్‌ పోషించారు. చిత్తోడ్‌గఢ్‌ రాజు రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. తొలుత చిత్ర బృందం ఈ సినిమాను డిసెంబర్‌ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు వెల్లడించింది. తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
పద్మావతి' చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయటం లేదు. వ‌యాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, స్టూడియో ఈ మేరకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది' అని ఓ ప్రకటనలో తెలిపింది. సినిమా ఆన్‌ సెట్స్‌లో ఉన్నప్పుడే చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్‌ కర్ణి సేనలు ఆరోపణలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటువంటిది ఏమీ లేదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చెబుతున్నారు. మరి, విడుదల ఎందుకు వాయిదా వేశారో? బీటౌన్‌లో ఏం జరుగుతుందో? మున్ముందు వేచి చూడాల్సిందే మరి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా