By : Oneindia Telugu Video Team
Published : November 07, 2017, 10:21

Paradise Papers Leak : కేంద్రమంత్రి నుంచి జగన్ వరకు ఎందుకంటే?

ప్రపంచంలోని చాలా చిన్న దేశాల్లో పన్నులు లేవు. దీంతో ప్రముఖులు అక్రమంగా లేదా సక్రమంగా సంపాదించిన సొమ్మున అక్కడి కంపెనీల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇలాంటి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తోంది అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల సమాఖ్యతాజాగా, ఐసీఐజే పారడైజ్ పేపర్స్ పేరుతో చాలామంది, సంస్థల పేర్లు వెలుగులోకి తెచ్చింది. ఇందులో భారత్‌కు చెందిన 714 మంది పేర్లు ఉన్నాయి. ఇది కలకలం రేపుతోంది. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఇలా ఎందరో ఉన్నారు.
బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, కార్పొరేట్‌ దళారీ నీరా రాడియా, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా, హైదరాబాద్‌కు చెందిన హెటెరో డైరెక్టర్లు వెంకట నరసారెడ్డి, పార్థసారథిరెడ్డి తదితరుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి జయంత్ సిన్హా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న డి లైట్‌ డిజైన్‌ అనే సంస్థకు డైరెక్టర్‌గా పని చేశారు. జయంత్ సిన్హా పేరు రావడంపై పీఎంవో స్పందించింది. ఒమిడ్యార్‌లో జయంత్ కొన్ని పెట్టుబడులు పెట్టారని, దానిపై ఎలాంటి వడ్డీ వచ్చినా ప్రస్తుతానికి లెక్కించే పరిస్థితి లేదని పీఎంవో వెబ్ సైట్ పేర్కొంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా