By: Oneindia Telugu Video Team
Published : November 09, 2017, 11:52

పారడైజ్‌లో నిమ్మగడ్డ పేరు:నివ్వెరపోయే నిజాలు

Subscribe to Oneindia Telugu


వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జీషీట్లలో నాలుగో దానిలో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు పారడైజ్ పత్రాల్లో వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.
ప్రసాద్‌ నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్స్ అప్లెబీ రికార్డుల్లో ఉన్నాయని ఐసీఐజేలో సభ్యత్వం ఉన్న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. 2016లో ఐసీఐజే ప్రచురించిన బహమాస్‌ లీక్స్ పత్రాల్లోనూ నిమ్మగడ్డ పేరుంది.
రస్‌ అల్‌ ఖైమా పెట్టుబడులు సంస్థ (రాకియా), ఓడరేవు-నిజాంపట్నం రేవు పారిశ్రామిక కారిడార్ (వాన్‌పిక్‌), లెబనాన్‌-స్విస్‌ జాతీయుడైన రాకియా సీఈవో ఖతేర్‌ మస్సాద్‌‌లతో నిమ్మగడ్డకు ఉన్న సంబంధాలను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి
ఆర్థిక శాఖ అభ్యంతరాలను పక్కన పెట్టి 22 వేల ఎకరాల భూముల్ని ప్రసాద్‌కు కట్టబెట్టినట్లు 2012లోనే సీబీఐ 177 పేజీల ఛార్జీషీటులో పేర్కొంది. భూమిపరంగా పొందిన లబ్ధికి ప్రతిఫలంగా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన జగన్‌ కంపెనీల్లో రూ.854 కోట్ల పెట్టుబడుల్ని నిమ్మగడ్డ పెట్టినట్లు తెలిపింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా