By: Oneindia Telugu Video Team
Published : November 06, 2017, 12:42

ప్యారడైజ్ పేపర్స్ లీక్ సంచలనం ?

Subscribe to Oneindia Telugu

భారత్ లోని నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ లీక్ ఇంకా మరిచిపోకముందే మరో లీక్ కలకలం రేపుతోంది. ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగ్గొట్టిన నల్లకుబేరుల జాబితా ఒకటి బయటపడింది. ఇందులో 180 దేశాలకు చెందిన బడాబాబుల డేటా లీకవగా.. అందులో భారత్ నుంచి 714మంది ఉండటం గమనార్హం. లీకైన డేటా పరంగా భారత్ 19వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లీకేజీ వెనుక ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసినట్టు సమాచారం. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజే నే కావడం గమనార్హం. పన్నుల నుంచి తప్పించుకునేందుకు బడా బాబులు, కంపెనీలు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో విపులంగా ఉంది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ' తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది.
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో ప్రతి వారం కోర్టుకు హాజరవుతున్న జగన్ పేరు పారడైజ్ పేపర్లలో ఉందని వార్తలు రావడం కలకలం రేపుతోంది. అయితే దీనిపై వైసిపి మాట్లాడాల్సి ఉంది. వైయస్ జగన్ పేరు కూడా ఈ జాబితాలో ఉందంటే ఆయన సంపాదనకు ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని వార్తలు వచ్చాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా