By : Oneindia Telugu Video Team
Published : May 18, 2017, 10:47

పవన్‌ ... పార్టీ రోడ్డెక్కింది సరే మరి నెక్స్ట్‌ ఏంటి ?

జనసేనుడిగా... జనసేన నాయకుడిగా... పవన్‌ కళ్యాన్‌ ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయారు. రాజకీయాల్లో ఆయన ప్రత్యక్షంగా పోరాటం మొదలుపెట్టేసేందుకు అన్నీ రెఢీ చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్‌ కొత్త తరహా రాజకీయాన్ని తెరపైకి తెస్తున్నారు. కంటెంట్‌ రైటర్స్‌ కోసం... ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే చదువుకున్న వ్యక్తులకే జనసేనలో చేరేందుకు అర్హత ఉంటుందా..? అదే నిజమైతే ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న వారు ఎక్కువ శాతం తక్కువగా చదువుకున్న వారే ఉన్నారు. అయితే వారికి జనాల్లో పట్టుకూడా ఎక్కువగా ఉంటుంది. రాజకీయమంటేనే మాటకారితనం ఉండాలి. కనస్ట్రక్టివ్‌ పొలిటిషియన్‌గా ఎదగాలంటే... సమకాలీన రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి. పీజీలు పీహెచ్‌డీలు చేసినంత మాత్రాన మంచి రాజకీయ నాయకుడిగా భవిష్యత్తు ఉంటుందనుకోవడం పొరపాటే అవుతుందనేది పలువురి అభిప్రాయం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా