By: Oneindia Telugu Video Team
Published : December 12, 2017, 05:56

పవన్ టార్గెట్ రివర్స్ అయిందా ?

Subscribe to Oneindia Telugu


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే తనకు అధికార యావ లేదని, ప్రజల సంక్షేమం కోరుకుంటున్నానని చెప్పడం ద్వారా తప్పు చేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానులతో పాటు చాలామందిలో ఇది చర్చనీయాంశంగా మారింది.
గత వారం పవన్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించారు. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, పోలవరం ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా
తనకు కావాల్సింది అధికారం కాదని, ప్రజా సంక్షేమం అని, దాని కోసమే తాను పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటిస్తున్నారు. అంతేకాదు, ఈ పర్యటన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం ముఖ్యం కాదని, అయినా తనకు అనుభవం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, అధికారం ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయవచ్చుననే అపోహ కూడా సరికాదన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేసినా ఇది సరైనది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సీఎం అయ్యేందుకు తనకు అనుభవం లేదని చెప్పారు. తద్వారా 2019లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని ఓ రకంగా తేల్చి చెప్పారు. అది అభిమానులకు కూడా నిరాశ కలిగించే విషయమే.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా