By : Oneindia Telugu Video Team
Published : April 06, 2018, 01:10

చంద్ర బాబు మళ్ళీ అదే తప్పు చేస్తునాడు : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట మాట్లాడితే సర్రున వెళ్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన 'ఎవరి రాజధాని అమరావతి' అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐవైఆర్ కృష్ణారావు, సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, సీనియర్ రాజకీయ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వర రావుకు అంకితమివ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ పుస్తకం చదవగానే రాజధాని అంటే ఏమిటి? ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు తెలుస్తాయన్నారు.
ఇప్పుడు ఏపీలో పవన్ ఏం మాట్లాడినా సర్రున వెళ్తోందని ఉండవల్లి అన్నారు. అవిశ్వాసం విషయమై పార్లెమంటు ఎన్ని రోజులు ఆగిపోయిందో చూశామన్నారు. అవిశ్వాస తీర్మానం మేము పెడతామంటే మేము పెడతామంటున్నారని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం పవన్ కళ్యాణే అన్నారు.
ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడితే నమ్మక ద్రోహం అంటారని, పవన్ మాట్లాడితే ఇన్నాళ్లకు మెలకువ వచ్చిందా అంటారని ఉండవల్లి టీడీపీని ప్రశ్నించారు. ఈ పాచిపోయిన లడ్డూలతో సర్దుకు పోవాలా అని పవన్ ఎప్పుడో ప్రశ్నించారన్నారు. ఈ సమయంలో పవన్ రాజకీయాల్లోకి రావడం పెద్ద రిస్క్ అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఆశీర్వదించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఒక మనిషి దెబ్బలాడేందుకు బయటకు వచ్చినప్పుడు, ఆ మనిషి వెనుక మనం నిలబడకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతామని, ఆ ద్రోహం చేయవద్దన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా