By : Oneindia Telugu Video Team
Published : April 06, 2018, 04:10

ప్రత్యేక హోదా కోసం తాము నిజాయితీగా పోరాటం చేస్తాం : పవన్ కళ్యాణ్

అందరితో కలిసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు.హోదాపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నాటకాలను ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని చెప్పారు.ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు.శుక్రవారం ప్రత్యేక హోదా కోసం జనసేన, సీపీఎం, సీపీఐలు పాదయాత్ర ప్రారంభించాయి. ఈ సందర్భంగా పవన్, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణలు మాట్లాడారు. నాయకులు అమ్ముడుపోతారేమో కానీ ప్రజలు, ప్రజా నాయకులు ఎప్పటికీ అమ్ముడుపోరని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా కోసం తాము నిజాయితీగా పోరాటం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. కార్యకర్తలతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమే అన్నారు.బెంజ్ సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎర్రటి కండువాను తలకు చుట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. పవన్ కొంత భిన్నంగా కనిపించారు.లెఫ్ట్ పార్టీలతో దోస్తీ నేపథ్యంలో ఆయన ఎర్రటి కండువాతో పాల్గొన్నారని భావించవచ్చు. పవన్ అక్కడక్కడ మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు. ఎండ వేడికి తాళలేక సీపీఎం మధు తన చొక్కాను విప్పగా, దానిని తన చేతిపై వేసుకొని పవన్ కళ్యాణ్ ముందుకు నడిచారు
3.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండాలని ముందే నిర్ణయించారు. అలాగే రామవరప్పాడులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని కూడా నిర్ణయించారు.పవన్, లెఫ్ట్ పార్టీల నేతల పాదయాత్రకు బందోబస్తు ఏర్పాటు చేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా