• search
By : Oneindia Telugu Video Team
Published : April 18, 2018, 03:38
Duration : 01:47

ప్రభుత్వ గన్‌మెన్లను పవన్ ఎందుకు వెనక్కి పంపాడు?

ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెనక్కు పంపారు. తనకు నియమించిన సెక్యూరిటీని ప్రభుత్వం తనపై నిఘా కోసం ఉపయోగించుకొంటుందని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన గన్‌మెన్లను వెనక్కు తిప్పి పంపారు. పార్టీ కార్యకలాపాలు లీక్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. నెలరోజుల్లోనే ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని వెనక్కు పంపడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఈ సెక్యూరిటీ కారణంగా లాభం కంటే నష్టమే అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్న తరుణంలో పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చి 14వ తేదిన గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ డీజీపికి లేఖ రాశారు.
ఈ లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించింది. ప్రతి షిప్టులో ఇద్దరు గన్‌మెన్లు పవన్ కళ్యాణ్‌తోనే ఉంటారు. మిగిలిన ఇద్దరూ గన్‌మెన్లు రెస్ట్‌ తీసుకొంటారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తనకు నియమించిన సెక్యూరిటీ వెనక్కు పంపారు.ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడ పంపారని తెలుస్తోంది.
పార్టీ అంతర్గత విషయాలు లీకయ్యాయని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. జనసేన రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలపై పార్టీ చేసిన చర్చలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చేరిపోయిందనే అభిప్రాయం జనసేనవర్గాల్లో నెలకొంది. నెల రోజుల కాలంలో పార్టీకి సంబందించిన కీలక చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైందని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ తరుణంలో సెక్యూరిటీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన భావిoఛి సెక్యూరిటీని వెనక్కు పంపించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి