• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 28, 2018, 11:53
    Duration : 03:04

    ప్రచారానికి నేను, ఫోన్ చేస్తే లైన్లోకి రాలేదు: బీజేపీ ఎంపీపై పవన్


    పశ్చిమ గోదావరి జిల్లాను తాను ఎప్పుడూ మరిచిపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు. తనకు భీమవరంలో ఇంత అపూర్వ స్వాగతం లభించిందన్నారు. ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన ఎదగాలని భీమవరం నాయకులు కోరుకున్నారని చెప్పారు. అలాంటి వారందరికీ జనసేనలోకి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. 2019లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. అనుభవం కోసమే ఇన్నాళ్లు వేచి చూశానని చెప్పారు. అనుభవజ్ఞుడనే చంద్రబాబుకు 2014లో మద్దతిచ్చానని చెప్పారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా