By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 11:29

పవన్ అభిమానులలో అసంతృప్తి....హోదా పై పోరు సాధ్యమేనా?

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు ఆయన అభిమానుల్లోనూ అసంతృప్తిని రాజేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన నాడే.. ఆయన ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాల్సి ఉంది. అయినా సరే తన పోరాటమంతా ట్విట్టర్‌కే పరిమితం చేసేశారు జనసేనాని.ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే క్రియాశీలకంగా అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్..ఇప్పుడైనా గట్టి కార్యాచరణతోనే రంగంలోకి దిగుతారని అంతా భావించారు.కానీ బుధవారం నాడు ఆయన ప్రెస్ మీట్ చూశాక చాలామంది ఉసూరుమన్నారు అన్న వాదన వినిపిస్తోంది. వామపక్షాలతో కలిసి 'మార్నింగ్ వాక్ ఉద్యమం'అంటూ ఆయన చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ రహదారుల మీద ధర్నాలంటే దద్దరిల్లిపోయేలా ఉండాలి కానీ.. ఏదో చేశామా? కానిచ్చామా? అన్నట్టుగా చేస్తే దానివల్ల ఉపయోగమేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా..కనీసం ఎంతదూరం నడుస్తారో కూడా చెప్పకుండా.. ఎలాంటి కార్యక్రమాన్ని రూపొందించారని ప్రశ్నిస్తున్నారు
హోదా ఏపీ ప్రజల సెంటిమెంటుగా మారిన ప్రస్తుత తరుణంలో.. దానికి సంబంధించిన ఏ కార్యాచరణ అయినా ఢిల్లీని తాకే స్థాయిలో దాని సెగ ఉండాలి.అంతే తప్ప.. ఏదో చేసేశాంలే అన్నట్టుగా వ్యవహరిస్తే మరో 'ఫ్లాప్ షో'ను మూటగట్టుకోవడమే తప్ప మరొకటి కాదనేది పరిశీలకుల అభిప్రాయం.
ఇకపోతే హోదా కోసం ఆమరణదీక్షకైనా సిద్దమన్న పవన్ కల్యాణ్.. దాని గురించి మాత్రం సమాధానం దాటవేయడం కూడా కొంతమందికి నచ్చలేదు. ఆమరణదీక్ష కాకపోయినా ఆ స్థాయిలో పవన్ మరేదైనా ప్లాన్ చేసి ఉండాల్సింది అంటున్నారు. నడక ఉద్యమాలతో ఢిల్లీ రాజకీయాలను కదలించడం అయ్యే పనేనా? అనేది వారి ఆవేదన.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more