By: Oneindia Telugu Video Team
Published : July 31, 2017, 01:49

బాబుతో పవన్ భేటీ...ఎందుకో తెలుసా ..?

Subscribe to Oneindia Telugu

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. హార్వార్డ్ బృందంతో కలిసి ఆయన బాబును విజయవాడలో కలుస్తారు.ఈ సందర్బంగా..జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడ ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. అనంతరం గన్నవరం నుంచి విజయవాడ బయలుదేరారు. పవన్‌ను చూసేందుకు చాలామంది అభిమానులు వచ్చారు. జై పవన్, జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అంతమంది అభిమానులు రావడంతో ఆ దారి చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో పవన్ కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అనంతరం ఆయన హార్వార్డ్ టీంతో కలిసి విజయవాడ చేరుకున్నారు.ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా