By : Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 02:54

బాబు తో పవన్ భేటి ... ఎందుకో?

ఉద్దానం సమస్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించేందుకు పవన్ భేటీ కానున్నట్లు చెబుతున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం భేటీ కావొచ్చని తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పోలింగ్ ముగిసిన తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బాబుతో తాజా భేటీ సందర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన తరఫున పరిశీలించిన అంశాల్ని వివరించటంతో పాటు.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన డయాలసిస్ కేంద్రాల్ని.. మందుల పంపిణీపైన సూచనలు చేస్తారని చెబుతున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా