By: Oneindia Telugu Video Team
Published : December 08, 2017, 10:42

అజ్ఞానవాసి!: పవన్‌పై మరోసారి కత్తి మహేష్

Subscribe to Oneindia Telugu


జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సినీ క్రిటిక్ కత్తి మహేష్. ఇప్పటికే పలుమార్లు పవన్ పై విమర్శలు చేసి.. ఆయన అభిమానుల నుంచి బెదిరింపులను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.అయితే, తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ తీవ్రంగా స్పందించారు.పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో పవన్ వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో పవన్ మాట్లాడుతున్న ప్రతి అంశంపై విమర్శలు చేస్తున్నారు కత్తి మహేష్. తాజాగా కత్తి మహేష్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు.. అజ్ఞానవాసి అని తేలుతోంది. అంతే!' అంటూ కత్తి మహేష్ తాజాగా పవన్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్‌పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పవన్ ఫ్యాన్స్ తన వెంట పడ్డారని, ఇప్పుడు, పవన్ వెంట తాను పడుతున్నానని మహేశ్ కత్తి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘కాటమరాయుడు' సినిమా అప్పుడు నేను మాట్లాడితే, పవన్ ఫ్యాన్స్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ‘మా దేవుడిని అంటావా?' అంటూ పవన్ ఫ్యాన్స్ నన్ను విమర్శించారు. నేను ప్రజాస్వామ్యంలో ఉన్నా. రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నా.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా